తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 21 తెలుగు వెలుగు)జూలూరుపాడు మండలం లో గత కొంత కాలం క్రితం నాటు సారా వ్యాపారులపై మరియు తయారీదారులపై ఆకస్మికంగా దాడులు చేసిన కొత్తగూడెం ఎక్స్చేంజ్ సిఐ ఎల్ జయశ్రీ ఈరోజు నాటు సారా తయారీదారులను మరియు బెల్లం పట్టిక వ్యాపారాలు చేసే వారిని జూలూరుపాడు మండల తాసిల్దార్ స్వాతి బిందు ముందు హాజరు పరిచారు వారు బానోత్ అథిరాం గిద్దెలగూడెం, బోడ బాలు తవిసిగుట్ట, గుగులోతు వెంకటేశు గోపా తండా, బానోత్చిలికి గోపాతండా, గుగులోత్ కైక గురువా తండా, వాంకుడోత్ సుజాత గురువారం తండా, ఎం వాలియా మాచినేని పేట , భూక్య పద్మ గుండ్ల రేవు, మిట్టపల్లి మణికంఠ జూలూరుపాడు కిరాణా ఒక్కొక్కరు వ్యక్తిగత పూచీకతుగా రెండు లక్షలు రూపాయల బాండ్ పేపర్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్చేంజ్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రావు వున్నారు కొత్తగూడెం ఎక్సేంజ్ సీఐ ఎల్ జయశ్రీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా మత్తు పదార్థాలపై వ్యాపారాలు కొనసాగించే వాళ్లను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ