తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ తెలిపారు. ముత్యాలంపాడు, పాత తండా, రాంపురం, తడికలపూడి, లక్ష్మీపురం సహా పరిసర తండాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. పనుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ