తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ చేతుల మీదుగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎస్సై రాణా ప్రతాప్ ప్రశంసా పత్రాన్ని, ప్రత్యేక రివార్డును అందుకున్నారు. సమాజానికి సవాల్ గా మారుతున్న మాదకద్రవ్యాల రవాణా, వినియోగం వంటి మత్తుపదార్థాల నియంత్రణకు ఎస్సై రాణా ప్రతాప్ తన వంతు బాధ్యతగా కృషి చేశారు. ఇందులో భాగంగానే గంజాయి పట్టివేత కేసులో నేరస్తులకు 20 ఏళ్లు జైలు శిక్ష పడే విధంగా ఆయన కేసును సమర్థవంతంగా విచారణ చేపట్టారు. ఈ సమర్థతను గుర్తించిన రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈరోజు హైదరాబాద్ లక్డికాపూల్ లోని డీజీపీ కార్యాలయంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఎస్సై రాణా ప్రతాప్ ను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఐపీఎస్ , స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో సందీప్ శాండిల్య ఐపీఎస్ , ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జయంతి పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ