తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధిలో ఉన్నటువంటి చెరువులు ఆక్రమణకు గురయిని అని బి.ఎస్.పి భారతీయ గోర్ బంజారా. మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో దీక్షలు చేయగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి ఇప్పుడు ప్రతి చెరువులలో నీరు ఉన్నాయి తర్వాత సర్వే చేసి హద్దులు నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో దీక్షను విరమింప చేసారు ఆ హామీ కి అనుగుణంగా ఈరోజు ఇరిగేషన్ ఏఈ మీనా ఆధ్వర్యంలో సర్వేకు వచ్చి ఎర్ర చెరువు, జమ్మికుంట, లక్ష్మీదేవి కుంటను చూసి ఆక్రమణకు కొంతవరకు గురైనవి చెరువులు అసలు ఎంతవరకు గురయ్యాయి అనేది తెలియాలి అంటే రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖల జాయింట్ సర్వే చేయాలని అలా చేస్తేనే ఎంత మేరకు ఆక్రమణకు గురి అయినవి తేలుతుందని వారన్నారు తక్షణమే రెవెన్యూ వారికి జాయింట్ సర్వే నిర్వహించాలని లెటర్ పంపిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు తంబర్ల నరసింహారావు, భారతీయ గోర్ బంజారా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ