తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వైకుంఠధామానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ స్థానిక తహసిల్దార్ టి శ్రీనివాస్ కి పడమట నర్సాపురం గ్రామస్తులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపురం గోపాలకుంట చెరువులో కట్టిన వైకుంఠధామం ప్రతి ఏటా వర్షాకాలం నీటిలో మునుగుతుందని అన్నారు. దానితోపాటు నేటికీ దారి లేదని తెలిపారు. ఈ రెండు కారణాల వలన ఆ స్మశాన వాటిక ఎవరికి ఉపయోగపడటం లేదని అన్నారు. దీనివలన గ్రామంలో భూమిలేని నిరుపేదలు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందుకు నానా అవస్థలు పడవలసి వస్తుందని వాపోయారు. కావున గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిని కొంత స్మశాన వాటికకు కేటాయించాలని గ్రామస్తులు తహశీల్దార్ శ్రీనివాస్ ని కోరారు. ఈ కార్యక్రమంలో లేళ్ళ అప్పిరెడ్డి, సంఘం నాగరాజు,లేళ్ళ గోపాలరెడ్డి, బాదావత్ వెంకట్రామ్, బాదావత్ రామకోటి, గోసు రామారావు, తెల్లబోయిన మల్లికార్జునరావు, మొవ్వ శ్రీనివాసరావు, వెలగా తిరుపతిరావు, బాదావత్ హరీష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ