Friday, 19 June 2026 05:48:07 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన కార్యక్రమం

Date : 01 December 2025 06:31 PM Views : 168

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, దాక్కు సహకారంతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య అధికారి డా. తుకారం రాథోడ్ మాట్లాడుతూ: హెచ్ఐవీ వంటి హెపటైటిస్-బి, హెపటైటిస్-సి కూడా రక్తం ద్వారా వ్యాపించే వ్యాధులేనని, యువతలో డ్రగ్స్ వాడకం పెరగడం ఆందోళనకారణమని, వివాహానికి ముందు జాతకాలు కాదని, హెచ్ఐవీ స్థితిని తెలుసుకోవడం ఎంతగానో అవసరమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ హెచ్ఐవీ స్థితిని తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. అడిషనల్ రాజమల్లు, SPL జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మాట్లాడుతూ: ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ప్రతి వ్యక్తికి తప్పనిసరి అని, “ఎవరి హెల్త్ వారు” అన్న భావనతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. డా. సైదులు గారు మాట్లాడుతూ: విద్యార్థుల్లో మొబైల్ ఫోన్ వినియోగం అధికంగా ఉన్న తరుణంలో, హెచ్ఐవీపై సరైన అవగాహన కలిగి చదువులో ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు. ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డా. తేజస్విని గారు మాట్లాడుతూ: హెచ్ఐవీ సోకి చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం అందిస్తున్న సేవలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సురక్షిత లైంగిక సంబంధాలు, సురక్షిత రక్త మార్పిడి, ఒకరు వాడిన సూదులు/సిరంజీలను మరొకరు వాడకూడదని, టాటూలు వేయించుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. హెచ్ఐవీ అంటుకునే వ్యాధి కాదని, ఇది అంటించుకునే వ్యాధి అని అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ 20 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. అదేవిధంగా అవగాహన బృందం తమ ప్రదర్శనతో ప్రజలకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ కార్యకలాపాల్లో సేవలందించిన వారికి మెమెంటోలు ప్రదానం చేయడం జరిగినది కార్యక్రమంలోAddl DMHO డా. సైదులు,Addl Dist Judge.M .రాజమల్లు,Bar Council President.లక్కినేని సత్యనారాయణ,Jr.College Princilpal రమేష్,Art medical Officer Dr.తేజస్విని, TB ప్రోగ్రాం ఆఫీసర్ డా. పుల్లారెడ్డి,NCD ప్రోగ్రాం ఆఫీసర్ Dr.మధువరన్, మరియు వైద్య సిబ్బంది, కాలేజీ సిబ్బంది,kalajathara బృందం,electronic media,SsK,DSRC TPpct,DAPcU సిబ్బంది, మరియు NGO s పాల్గొన్నడం జరిగింది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :