తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో అమరజీవి మహమ్మద్ దాదా స్తూపం దగ్గర 58వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలీం ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జములయ్య మాట్లాడుతూ మొహమ్మద్ దాదా గారి లేని లోటు తీర్చలేనిదని ఆటో వర్కర్స్ సమస్యలు తన సమస్యలుగా భావించి ముందుండి పరిష్కరించేవాడని ఆటో వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని అనేక పోరాటాలు చేసి ఆనాటి ప్రభుత్వాలు తనపై అనేక కేసులు నమోదు చేసి జైలుకు సైతం పంపించారని కుల మతాలకు అతీతంగా సేవలు చేసేవాడని ముస్లిం అయినప్పటికీ ఆటో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయని రామవరం ఆటో స్టాండ్ దగ్గర అమ్మవారి గుడిని ప్రతిష్టించడం గర్వకారణమని నేటి సమాజానికి ఆదర్శంగా నిలబడ్డాడని మొహమ్మద్ దాదా ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదే తనకు ఇచ్చే నిజమైన నివాళులని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి కృష్ణ, హరినాథ్, బడుగు భాస్కర్, జనార్ధన్, జలీల్, అబ్బులు, బత్తుల సత్యనారాయణ,పాషా, హమీద్, జానీ,అజీమ్,గురుమూర్తి, అనీఫ్, సలీం, కన్నా, హబీబ్, యూసుఫ్,పాటి మోహన్, కనుకుంట్ల శ్రీను, రవి, ముస్తఫా,భాష, జంజర్ల శివ, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ