Sunday, 19 April 2026 03:13:20 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 23 March 2026 04:29 PM Views : 143

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ పదవ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ హై స్కూల్, సెయింట్ మేరీస్ హై స్కూల్, బాబు క్యాంపు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా జరుగుతున్నాయా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కలెక్టర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. త్రాగునీరు, విద్యుత్, సరైన కూర్చునే ఏర్పాట్లు, గదుల పరిశుభ్రత, ప్రశాంత వాతావరణం వంటి అంశాలను పరిశీలించి, అవసరమైన చోట్ల తక్షణమే మెరుగులు చేర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయగల వాతావరణాన్ని కల్పించాలన్నారు. పరీక్షల నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎలాంటి అక్రమాలు, మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం ఇవ్వకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో నియమించిన ఇన్విజిలేటర్లు, సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. పరీక్షల పారదర్శకతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు . పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 (బి) అమలు, భద్రతా చర్యలు, పోలీసు బందోబస్తు వంటి అంశాలపై కూడా కలెక్టర్ సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని, బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీలలో భాగంగా కలెక్టర్ విద్యార్థుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. సింగరేణి కాలరీస్ హై స్కూల్ సహా అన్ని పరీక్షా కేంద్రాల్లో 100 శాతం హాజరు నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ తనిఖీలు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :