Sunday, 21 June 2026 02:19:00 PM
# నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి.

*విద్యతోనే భవిష్యత్తు బాగుంటుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 19 February 2025 07:47 PM Views : 823

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం లక్ష్మీదేవి పల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పాఠశాలలోని పదవ తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృషి,పట్టుదల క్రమశిక్షణతో పదవ తరగతిలో విజయం సాధించి భవిష్యత్తులో ఏం చదవాలి అనే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు.తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టు కుని తమ పిల్లలు బాగా చదవాలని పాఠశాలలకు పంపు తుంటారని విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా బాగా చదివి ఉన్నత శిఖరాలను అవరోధించాలన్నారు . భవిష్యత్తులో ఏమి చదువుతారని, ఏ గ్రూపు తీసుకుంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివే విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. పరీక్షలకు కొన్ని రోజుల సమయం ఉన్నందున సమయాన్ని వృధా చేయకుండా చదవాలన్నారు. పరీక్ష సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ఏదైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులు అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రతి ఒక్క విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 100% ఉత్తీర్ణత కు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం తొమ్మిదవ తరగతి గదిలో విద్యార్థులతో మమేకమై వారికి మెనూ ప్రకారం భోజనం అందుతుందా, ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారు అని ఆరా తీశారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (FRS) లో హాజరును ఎలా నమోదు చేస్తున్నారు అని అధికారులు అడిగి, ప్రతిరోజు నమోదు కచ్చితంగా చేయాలని, ఆపార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వంట గదిలో రాళ్ల పొయ్యి మీద వంట వండటానికి గమనించిన కలెక్టర్ రాళ్ళకు బదులు ఐరన్ తో చేసిన పొయ్యిలను ఉపయోగించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మునగ మరియు కరివేపాకు ను వంటలలో ఉపయోగిస్తున్నారా అని అధికారులను అడిగి, విద్యార్థులకు ఆహారంలో వీటిని ఉపయోగించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని కాబట్టి వంటలో ఉపయోగించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణం మరియు రెండు బిల్డింగుల మధ్య రేకుల షెడ్డు నిర్మాణం ఆవశ్యకతను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎంఈఓ ద్వారా సైన్స్ ల్యాబ్ మరియు రేకుల షెడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండలరావు, ఎంపీడీవో చలపతి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ సాంబయ్య మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: