తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ – ఈశాన్య భారత కలయిక: ఒక సాంకేతిక-సాంస్కృతిక మహోత్సవం" – లోగో, ట్యాగ్‌లైన్, పోస్టర్ డిజైన్ పోటీకి సృజనాత్మక ఎంట్రీలు కోరుతూ పిలుపుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత, విద్యార్థులు, కళాకారులు మరియు డిజైనర్లు తమ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటుకునే సువర్ణావకాశంగా,తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం, రాజ్‌భవన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న"తెలంగాణ – ఈశాన్య భారత కలయిక: ఒక సాంకేతిక-సాంస్కృతిక మహోత్సవం"సందర్భంగా లోగో డిజైన్, ట్యాగ్‌లైన్ రచన, పోస్టర్ రూపకల్పనలపై ఓపెన్ పోటీకి ప్రజల నుండి సృజనాత్మక ఎంట్రీలు కోరుతున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.ఈ మహోత్సవం 2025 నవంబర్ 25–27 మరియు డిసెంబర్ 2–4 తేదీలలో హైదరాబాద్‌లో రెండు దశలుగా నిర్వహించబడనుందని,ఈ వేడుక ప్రధాన ఉద్దేశం – తెలంగాణ మరియు ఈశాన్య భారత రాష్ట్రాల (NE States) మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరస్పర మార్పిడికి వేదిక కల్పించడం అని కలెక్టర్ గారు వివరించారు. పోటీకి సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉంటాయని కలెక్టర్ గారు వివరించారు. పోటీ విభాగాలు:1. లోగో డిజైన్ 2. ట్యాగ్‌లైన్ రచన3. పోస్టర్ రూపకల్పన (A4/A3 సైజులో, డిజిటల్ ఫార్మాట్)ఎంట్రీల సమర్పణ మార్గదర్శకాలు:లోగో: ఒరిజినల్, స్కేలబుల్ PNG & ఎడిటబుల్ ఫార్మాట్ (AI/CDR/PSD) ట్యాగ్‌లైన్: ఇంగ్లీషులో, 10 పదాలకు లోపు, పోస్టర్: 300 డీపీఐ PNG లేదా PDF ఫార్మాట్ సబ్మిట్ చేయుటకు:ఇమెయిల్: telangananortheastconnect@gmail.com Subject Line: Entry for Logo/Tagline/Poster – [మీ పేరు] చివరి తేదీ: 15 ఆగస్టు 2025ఎంట్రీతో పాటు పంపవలసిన వివరాలు:పూర్తి పేరు ,వయసు, వృత్తి ,మొబైల్ నంబర్, ఇమెయిల్ ఛిచిరునామా లేదా ఐడి ప్రూఫ్ , 50–100 పదాల్లో డిజైన్ వెనుక ఉన్న ఆలోచన వివరాలు , నగదు బహుమతులు:ఉత్తమ లోగో డిజైన్ – ₹15,000 , ఉత్తమ ట్యాగ్‌లైన్ – ₹5,000 , ఉత్తమ పోస్టర్ డిజైన్ – ₹20,000అధికారిక సన్మాన కార్యక్రమం:ఎంపికైన విజేతలకు రాజ్‌భవన్, హైదరాబాద్ లో జరిగే అధికారిక కార్యక్రమంలో ఘన సన్మానం లభిస్తుంది. విజేతల డిజైన్‌లు, ట్యాగ్‌లైన్లు తెలంగాణ ప్రభుత్వ ప్రచారంలో భాగంగా వినియోగించబడతాయని కలెక్టర్ గారు తెలిపారు.ముఖ్య నిబంధనలు*:అన్ని ఎంట్రీలు ఒరిజినల్‌గా ఉండాలి. కాపీరైట్ ఉల్లంఘనలు ఉండకూడదు .ప్లాజియరిజం (నకలు) నిషేధం .లోగోలో తృతీయ పక్ష ఫోటోలు, ఐకాన్లు వాడకూడదు . ఎంపిక ప్రమాణాలు: సృజనాత్మకత, ఒరిజినాలిటీ, సాంకేతిక నైపుణ్యం, విజువల్ ఆకర్షణ . ఎంపికైన ఎంట్రీలు రాజ్‌భవన్ మేధోసంపత్తిగా పరిగణించబడతాయి . ఒక్కరే బహుళ ఎంట్రీలు పంపవచ్చు – అయితే ప్రతి ఎంట్రీని విడిగా పంపాలి . జిల్లా కలెక్టర్ గారి పిలుపుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ –"ఇలాంటి పోటీలు, ఉత్సవాలు జిల్లాలోని యువతకు తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు గొప్ప వేదిక.తెలంగాణ మరియు ఈశాన్య భారత రాష్ట్రాల మధ్య సాంకేతిక, సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబించేలా మీరు రూపొందించే డిజైన్‌లుభవిష్యత్‌లో ప్రభుత్వ ప్రచారాల్లో భాగంగా ఉపయోగించబడతాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలు, కళాశాలలు, కళాకారులు చురుకుగా పాల్గొనాలి.ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో వెలుగులోకి తీసుకురావాలి" అని తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ