తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి మండల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జి హెచ్ ఎస్ బాబు క్యాంపులో చుంచుపల్లి మండల విద్యాశాఖ అధికారి బాలాజీ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారి బాలాజీ గారు జి హెచ్ ఎస్ హెచ్ఎం నీరజ గారు, జెడ్పిహెచ్ఎస్ గౌతమ్ పూర్ హెచ్ఎం రాములు గారు కాంప్లెక్స్ సెక్రటరీస్ రాజయ్య మరియు వశ్య గార్లు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బాలాజీ గారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలకు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి పాఠశాలలను బలోపేతం చేయవలసిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయునికి ఉన్నదని గుణాత్మక విద్యతో పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ