తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : టేకులపల్లి మండలం భేతంపూడికి చెందిన ఈర్ల భరత్(19) శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి ఇల్లందు వచ్చి భేతంపూడి వెళ్తున్న క్రమంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ