తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడుగా ఎస్.కె సాబీర్ పాషా ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న సిపిఐ నాయకులు. పంజాబ్ లోని చండీగర్లో జరిగిన సిపిఐ 25వ జాతీయ మహాసభల్లో జాతీయ సమితి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కే షాబీర్ పాష ఎన్నిక పట్ల రామవరం ఉన్నందాస్ బస్తిలో సిపిఐ నాయకులు స్వీట్లు పంపిణీ చేసుకొని ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొత్తగూడెం శాసనసభ్యులు, పేదల పెన్నిధి కూనంనేని సాంబశివరావు అనూన్గా శిష్యుడుగా రాజకీయ ప్రస్థానం చేసి, పాత 12వ వార్డు రామవరం ఉన్నం దాస్ గడ్డ ,నేతాజీ బస్తి, బర్మా క్యాంప్ ,నెహ్రూ బస్తి, నాగయ్య గడ్డ, లక్ష్మీ టాకీస్ ఏరియాలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, కొత్తగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రజా ప్రతినిధిగా తన ప్రస్తానాన్ని కొనసాగించిన ఎస్.కె షబీర్ పాష సిపిఐ జిల్లా కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అంచలంచలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మా ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప పద్మ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి జిల్లా కౌన్సిల్ సభ్యులు భూక్య శ్రీనివాసులు అన్నారు. భవిష్యత్తులో మున్ముందు ప్రజల హృదయాలలో ఉన్న ఉన్నత పదవులను అధిరోహించి కొత్తగూడెం నియోజకవర్గానికి సేవలందించాలని వాళ్లు అభిలాషించారు. ఈ స్వీట్లు పంపిణీ కార్యక్రమంలో ఉన్నందాస్ గడ్డ వన్ ,టు శాఖా కార్యదర్శులు ఎస్కే జలీల్ ,తోగరు నరేంద్ర కుమార్, ఆటో యూనియన్ నాయకులు సంద శ్రీనివాస్, భూక్య మహేష్ ,భానోత్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ