తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మనుషుల అక్రమ రవాణా నిర్ములన లో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చు అని ప్రజ్వల స్వచ్చంద సంస్థ మరియు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ సెంటర్ భద్రాద్రి కొత్తగూడెం హాల్ నందు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ . ఈ శిక్షణలో భాగంగా డిస్ట్రిక్ట్ కలెక్టరు జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ నేను కలెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నపుడు ఈ ప్రజ్వల సునీత కృష్ణన్ మాటల వల్ల చాలా విషయాలు తెలుసుకున్న,ఈ అక్రమ రవాణా అనేది చాలా రకాలుగా,చాలా పద్ధతిలో జరుగుతుంది, దీనిని మనం అందరం కలిసి నివారించాలి. AMO నాగరాజు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య. దీనికి పేద మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువ గా గురి అవుతున్నారు. సమాజంలో ప్రజలతో మరియు విద్యార్థులతో సన్నిహితంగా ఉండి గమనించి వారికి అవగాహనా కల్పించాలి, ముక్యంగా పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్స్ లో వారికి అవగాహనా కల్పించాలి. సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జటిలమైన సమస్య కాబట్టి పిల్లలకు ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలి అని అన్నారు. సమాజంలో ఉన్న చాలా సమస్యలకు ఆర్థిక కారణలా తో పాటు, సామజిక కారణాలు దోహదం చేస్తాయి, మన చుట్టుపక్కల ఉండే ఇలాంటి వాళ్ళను ట్రాఫికెర్స్ టార్గెట్ చేసి, మాయమాటలు, ఉద్యోగం సినిమా అవకాశం అంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహలలో అమ్ముతున్నారు, కాబట్టి మన డిపార్ట్మెంట్ జిల్లా నుండి గ్రామ స్థాయి వరకు అందరు అవగాహనా కలిగి ఉండి, అప్రమతం చేయడం ద్వారా దీన్ని నిర్ములించవచ్చు. చట్టాల పైన అవగాహన పెంచుకోవాలి అని అన్నారు ప్రజ్వల కోఆర్డినేటర్ శ్రావ్య శృతి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించు కోవచ్చు, ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు మహిళలు దీని బారిన పడుతున్నారు. ముక్యంగా యువత, పిల్లలు ఆకర్షణకు గురి అయి, పట్టణాలకు వచ్చి వ్యభిచార గృహలలో అమ్మబడుతున్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 32 వేల మంది అమ్మాయిలను మహిళలను కాపాడడం జరిగింది. ఇందులో చిన్న పిల్లలు, యువతులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సైబర్ ట్రాఫికింగ్ ద్వారా ఈ అక్రమ రవాణా చాలా పెరిగి పోయింది, ముక్యంగా విద్యార్థులు అనవసరం అయినా అప్స్ ద్వారా పర్సనల్ ఫొటోస్ వీడియోస్ పంపడం ద్వారా సెక్స్ ట్రాఫికింగ్ కి గురి అవుతున్నారు. మీరు జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఉన్న మన సిబ్బంది ఈ విషయాలపై అవగాహనా పొంది ఇతరులకు అవగాహనా కల్పించాలని సూచించారు. ఈ శిక్షణలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ చెన్నకేశవులు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం ఎలా జరుగుతుంది, బాధితురాలి పైన ఉండే ప్రభావాలు, సైబర్ అదారిత అక్రమ రవాణా, చట్టాలు BNS, ITPA, POCSO, PCMA, సఖి, భరోసా, చైల్డ్ లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181 ల గురించి చెప్పడం జరిగింది ఇందులో భాగంగా PP మౌలిక మాట్లాడుతూ బాలబాలికల పై జరుగుతున్న లైగిక నేరాల గురించి మాట్లాడం జరిగింది పిల్లలతోని మనం ఎలా ఉండాలి మరియు ఎలా రక్షించాలి అనే అంశం పై మాట్లాడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజ్వల కోఆర్డినేటర్ శ్రావ్య శృతి , RP మౌలిక , అసిస్టెంట్ కోఆర్డినేటర్ చెన్నకేశవులు , జిల్లా లోని school నుండి school assistant teacher పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ