తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో మే నెల 11 ,12 తేదీల్లో పంచముఖ ఆంజనేయ స్వామి వార్షికోత్సవ సందర్భంగా జరుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీకృష్ణరాయబారం పౌరాణిక పద్య నాటకము ప్రదర్శించుటకు శిక్షణ నిమిత్తం స్థానిక కళాకారుల ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర నాటక సమాజల సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పాకాలపాటి రోశయ్య చౌదరి హాజరై, స్థానిక శివాలయంలో మరియు కోట మైసమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని విష సంస్కృతిని ఒక వెల్లువ లా విస్తరింప చేస్తున్న సినీ టీవీ సోషల్ మీడియా రంగాల నుండి మనలను, మన సమాజాన్ని రక్షించుకోవడానికి మన సాంప్రదాయ ప్రాచీన కళలు, నాటకాలు, పల్లెలలో పట్టణాలలో విరివిగా ప్రదర్శింపజేయాలని ఆయన ప్రసంగములో ఉద్ఘాటించారు. ఈ పూజా కార్యక్రమంలో పాపకొల్లు సర్పంచ్ బాదావత్ రాంబాబు, ఉప సర్పంచ్ తోట రామారావు, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి నాట్య కళామండలి సభ్యులు, నిర్వాహకులు, గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ