Sunday, 19 April 2026 01:58:04 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

57 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ముఖ్య అతిధి కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 05 September 2025 08:02 PM Views : 630

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి బి నాగలక్ష్మి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులు గా నేర్చుకుంటూనే తరగతి గది లో విద్యార్థుల సర్వతోముఖభి వృద్ధి కై పాటుపడాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు ప్రతీ విషయాన్నీ తాము ముందుగా చదువుకొని విషయం పై పట్టు పెంచుకోవాలన్నారు. విద్యార్థులు హోంవర్క్ చేసేలా చూడాలన్నారు.విశిష్ట అతిధి అశ్వారావుపేట శాసన సభ్యులు జారె ఆదినారాయణ మాట్లాడుతూ తాను ఉపాధ్యాయుడుగా వృత్తిని చేసిన రోజులను స్మరించుకుంటూ, ఉపాధ్యాయుల బోధనా విధానాలను బట్టే విద్యార్థులు వారి జీవితాల్లో చిరస్థాయి గా గురువులను గుర్తుంచుకుంటారని అన్నారు. తాను విద్యార్థిగా, ఉపాధ్యాయుడుగా ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్నని పనిచేసానని, రాష్ట్ర, దేశ స్థాయి లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా అని అన్నారు. శాసన సభ్యులుగా ఎదగటానికి నాకు పేగుబంధం వున్న ఉపాధ్యాయులు ఎంతో సహకరించారని అన్నారు.జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు అందరు తన దృష్టిలో ఉత్తమ ఉపాధ్యాయులే అన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చెర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విద్య పై మంచి విజన్ వున్నదని, విద్యాశాఖాను తన దగ్గరే ఉంచుకొని ప్రత్యేక సంస్కరణలు తెస్తున్నారు అని అన్నారు.జిల్లా విద్యాశాఖాదికారిణి నాగలక్ష్మి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమం లు చేయటానికి మండలం స్థాయిలో 5000 రూపాయలు, జిల్లా స్థాయిలో 15000 రూపాయలు ప్రత్యేక నిధులు మంజూరు చేసారని, జిల్లా వ్యాప్తంగా 57 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ను గుర్తించి వారికి శాలువా, ప్రశాంస పత్రము, జ్ఞాపిక లను అందచేస్తున్నట్లు తెలిపారు. ట్రైనీ కలెక్టర్ సౌరభ శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని అన్నారు.నాకు గురువు ఈ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అని కొనియాడారు. నేను ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నానని ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నానని ఇప్పటికే ఈ కలెక్టర్ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమం తో పాటుగా జిల్లా కలెక్టర్ నిర్దేశించిన విత్తనాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 23 మండలాల లోని ప్రథమ స్థానంలో నిలిచిన 23 పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించడం జరిగినది. కార్యక్రమం ప్రారంబానికి ముందు పలు పాఠశాలల విద్యార్థులు చేసిన స్వాగత నృత్యాలు అద్భుతంగా అలరించాయి.కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్ లు నాగరాజ శేఖర్, సైదులు, సతీష్, అన్నమణి, పరీక్షల విభాగం అధికారి మాధవరావు, డి సి ఇ బి సెక్రెటరీ నీరజ, కొత్తగూడెం MEO మధురవాణి, ప్రధానోపాధ్యాయులు పద్మలత , రమాదేవి, కార్యక్రమ నిర్వహణ బాధ్యులు జంకిలాల్, బాలాజీ, నరేష్, ప్రేమ్. ప్రెస్ ఇంచార్జ్ షేక్ దస్తగిరి,. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :