తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు భారతీయ జనతా పార్టీ సుజాతనగర్ మాజీ మండల అధ్యక్షులు భూక్యా రాజేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సుజాతనగర్ మండలంలో ఇప్పటివరకు పైలెట్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి కోమటిపల్లి గ్రామపంచాయతీ తప్ప మిగతా ఏ ఒక్క పంచాయతీలో కూడా ఒక్క ఇల్లును కూడా మంజూరు చేసి ఇండ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కానీ శంకుస్థాపనలు చేసిన పనులు గాని లేవు. ఈ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఈ రాష్ట్రంలోనే ఏకైక సీటు సంపాదించి పోటీ చేసి గెలిచినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే అయిన కునంనేని సాంబశివరావు గారు ఇంతవరకు సుజాతనగర్ మండలంలోని ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఇంటి పట్టాలు ఇచ్చి శంకుస్థాపనలు చేసినటువంటి దాఖలాలు లేవు. పైగా రాష్ట్రం మొత్తం ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పుకుంటూ కాలం వెళ్లతీసుకున్నటువంటి రెవిన్యూ మంత్రి గారు , సొంత ఉమ్మడి జిల్లాలో మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయం లో వారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండల ప్రజలు ఏం పాపం చేసరని మండల ప్రజల తరఫున ప్రశ్నించారు ఇందిరమ్మ రాజ్యమంటూ అబద్ధాల హామీలు ఇస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా మేల్కొని వాస్తవాలు చెప్పి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని , రైతు భరోసా తో పాటు రైతు కూలీ ఆత్మీయ భరోసా కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు . ఇప్పటికైనా ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతు, గిరిజన ప్రాంతమైనటువంటి సుజాతనగర్ మండలాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ