తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.... కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని గాజుల రాజాం బస్తీలో నివాసం ఉంటున్న ఆగుళ్ల మల్లేశం వీధి వ్యాపారం చేసుకుంటూ తన తన కుటుంబాన్ని పోషిస్తున్నానని, తాను ఒక వికలాంగుడు కావున దివ్యాంగుల కోటాలో తనకు వాహనం మంజూరు చేయాల్సిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డి డబ్ల్యు ఓ అధికారికి ఎండార్స్ చేశారు. ములకలపల్లి మండలం చాపరాల పల్లి గ్రామం లో నివాసం ఉంటున్న బానోతు కొండమ్మ, బానోతు ప్రతాప్, బానోత్ లచ్చిరాం, బానోతు భరత్ కుమార్ అనువారు వారి తాతగారైన బానోత్ జగ్య s/o పరిత్య పేరుమీద సర్వేనెంబర్ 251 మరియు 258 లో 38E పట్టా భూమి ఇప్పటివరకు కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ మరియు మా ఆధీనంలో ఉండి మేము సాగు చేస్తున్నామని, అట్టి భూమికి వారసులు కాకపోయినా వేరే వారి పేరు మీద పట్టా పాస్ పుస్తకం వచ్చి ఉన్నదని రైతుబంధు కూడా పొందుతున్నారని, కావున మా సమస్యను పరిష్కరించి తమ పేరు మీద పట్టా పాస్ బుక్ ఇప్పిస్తూ రైతుబంధు వర్తింప చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ములకలపల్లి తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు. కొత్తగూడెం క్రాస్ రోడ్ నందు నివాసం ఉంటున్న వాయిలాల రాధిక d/o ఆనందరావు 2013 వ సంవత్సరంలో తన పైన యాసిడ్ దాడి వలన అంగవైకల్యం ఏర్పడిందని, జీవరాధారం లేని తనకు సొంత కాళ్ళ మీద నిలబడి కుటుంబాన్ని పోషించుకునేందుకుగాను బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేసి వ్యాపారం చేసుకోవడానికి సహకరించాలని చేసిన దరఖాస్తులను పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఓ ఎస్ డి కి ఎండార్స్ చేశారు. అక్షర చీట్ ఫండ్ భద్రాచలం నందు చిట్స్ మరియు డిపాజిట్లు చేసిన బాధితులు చీట్ ఫండ్ నందు పాట పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశ చూపి వారితో డిపాజిట్ పేరుతో కోట్ల రూపాయలు సేకరించి, ఆ డబ్బులు ఇవ్వకుండా అక్షర చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడుల రూపం తీసుకొని భూములు కొనుగోలు చేస్తున్నారని, కావున తమకు న్యాయం జరిగేలా చూసి తమ డబ్బులు తమకు ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఎస్పీకి ఎండార్స్ చేశారు.దమ్మపేట మండలం అక్కినేని పల్లి గ్రామంలో నివాసముంటున్న తుర్రం వెంకటేష్ s/o రాములు, చారు గుండ్ల ఉష w/o దుర్గారావు మరియు నరదల నాగేశ్వరరావు s/o వెంకటేష్ వారు అక్కినేపల్లి శివారు సర్వేనెంబర్ 625,626, 627 & 712 లో 21.34 కుంటల భూమి ని 1973 వ సంవత్సరం నకు పూర్వం అప్పటి అటవీశాఖ అధికారులు తమ శాఖకు చెందిన భూమిలో కలుపుకున్నట్లు సూచన( 3) ద్వారా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. సదరు భూమిపై మాకు వారసత్వరీత్యా హక్కులు ఉన్నందున అటవీ శాఖ వారు కలుపుకున్న మా భూమికి బదులు ప్రభుత్వ / రెవెన్యూ భూమిని మాకు కేటాయించవలసిందిగా కోరుతూ సంబంధిత అధికారులకు దరఖాస్తు సమర్పించామని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినారని, కానీ మాకు ఇంతవరకు అటవీ శాఖ వారు తీసుకున్న భూమికి బదులు భూమిని కేటాయించలేదని కావున త్వరితగతన పరిష్కరించాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఈ సెక్షన్ సూపర్డెంట్ కు ఎండార్స్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ