Monday, 20 April 2026 01:56:31 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

రైతు నేస్తం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 14 June 2025 07:12 PM Views : 823

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 16 సోమవారం జరుగు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని, ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. సోమవారం నిర్వహించి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడునున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న 58 రైతువేదికలలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సోమవారం అన్ని రైతు వేదికలను పండుగ వాతావరణం లో మామిడి తోరణాలు, రంగవల్లులతో అలంకరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకే రైతు వేదిక వద్దకు రైతులు చేరుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆడియో మరియు వీడియోలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా సరిచూసుకోవాలని ఏవైనా సమస్యలు ఉంటే రేపటిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు వేదికలకు విచ్చేసే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున హాజరు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలను పలకాలని అధికారులకు సూచించారు. ప్రతి రైతు వేదికలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మరియు మండల స్థాయిలో ఎంత మంది రైతులకు ఎంత మొత్తంలో రైతు భరోసా జమ అవుతున్నదో వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. రైతు వేదికలకు పెద్ద ఎత్తున రైతులు హాజరవుతారు కాబట్టి, రైతు వేదికల వెలుపల ఏబిసిడి డ్రైవ్ పై అవగాహన కల్పించే విధంగా స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమానికి రైతు వేదిక పరిధిలో మునగ సాగు చేపట్టి లబ్ధి చేకూరిన రైతులను ఆహ్వానించి వారి ద్వారా ఇతర రైతులకు మునగ సాగు ద్వారా వచ్చే లాభాలపై అవగాహన కల్పించాలన్నారు. రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏపీఎంలు కూడా హాజరు కావాలని, దాని ద్వారా వారు మహిళా సమైక్య సభ్యులకు అజోల్ల పెంపకం, బయోచార్ తయారీ, చేపల పెంపకం తదితర వాటిపై సభ్యులకు అవగాహన కల్పించడం ద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని కలెక్టర్ సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో దేశం మొత్తం జిల్లా వైపు చూస్తుందని దీనికి సహకరించిన ప్రతి అధికారి, ఉద్యోగస్తులను కలెక్టర్ అభినందించారు. రానున్న వర్షాకాలంలో ఎక్కడైతే వర్షం నీరు నిలుస్తుందో అక్కడ వెంటనే ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :