తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బుధవారం సాయంత్రం 3.35 గంటల సమయంలో సుజాతనగర్ ఎస్సై రమాదేవి తన సిబ్బందితో కొత్తగూడెం కు చెందిన షేక్ సమద్ యాకుబ్ పాషా మరియు సుజాతనగర్ మండలం డేగలమడుగు గ్రామానికి చెందిన కదురుబోయిన నరసింహరావు అను ఇద్దరు వ్యక్తులు నిషిదిత గంజాయితో వేపలగడ్డ లో ధన్వoతరి కాలేజ్ పక్కన ఉన్న ఖాళీ స్థలం లో పట్టుకొని వారి వద్ద నుండి Rs. 7580/ విలువ గల 151.6 గ్రాముల గంజాయిని, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ R. వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేసి నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కొత్తగూడెం కోర్టులో హాజరు పరిచారు. పట్టుబడిన నిందితుల వివరాలు: 1) షేక్ సమద్ యాకుబ్ పాషా , డ్రైవర్స్ కాలనీ, చాతకొండ, కొత్తగూడెం. 2) కుదురుబోయిన నరసింహారావు S/o నాగరాజు, డేగల మడుగు గ్రామం సుజాతనగర్ మండలం. పరారీలో ఉన్న నిందితుని వివరాలు:1.కిరణ్ @ దొంగ కిరణ్ R/o శేషగిరి నగర్,కొత్తగూడెం.
Admin
తెలుగు వెలుగు టీవీ