Wednesday, 27 May 2026 12:12:17 AM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

యువజన అభివృద్ధి – క్రీడా ప్రోత్సాహానికి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 25 April 2026 08:55 PM Views : 142

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యువత సమగ్ర అభివృద్ధి, క్రీడా రంగ ప్రోత్సాహం లక్ష్యంగా యువజన సర్వీసులు & క్రీడల శాఖ రూపొందించిన “99 రోజుల కార్యాచరణ ప్రణాళిక” పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సిపిఓ సంజీవరావు, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతలో నైపుణ్యాలు, ఆరోగ్య సదృఢత, నాయకత్వ లక్షణాల పెంపుదల దిశగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మారథాన్, ఫిజికల్ లిటరసీ కార్యక్రమాలు, యువజన నాయకత్వ సదస్సు, స్పోర్ట్స్ డే వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మే 5 నుండి మే 12 వరకు జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాల ద్వారా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, నిరుద్యోగ యువత తప్పనిసరిగా పాల్గొని ప్రయోజనం పొందాలని సూచించారు.పోస్టర్‌లో పొందుపరిచిన QR కోడ్‌లను స్కాన్ చేసి మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :