Sunday, 21 June 2026 02:18:20 PM
# నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి.

రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తాం - జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 26 November 2025 06:20 PM Views : 151

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్లు, ప్రక్రియలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ- జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 29 సాయంత్రం 5 గంటలని పేర్కొన్నారు. మొదటి విడతలో మారుమూల, సమస్యాత్మక ప్రాంతాలను ప్రాధాన్యంగా తీసుకుని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, అశ్వాపురం, బూర్గంపాడు , పినపాక, మణుగూరు, కరకగూడెం మండలాల పరిధిలోని 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపుచేసి ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట, చంద్రుగొండ, దమ్మపేట, ములకలపల్లి, చుంచుపల్లి, పాల్వంచ మండలాల్లోని 156 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మూడవ విడతలో ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, ఇల్లందు మండలాల్లోని 156 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 4,242 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, నామినేషన్ల స్వీకరణ కోసం 137 కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొదటి విడతలో 47 నామినేషన్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు విధుల్లో ఉన్నారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను గుర్తించి పోలీస్ శాఖతో సమన్వయం చేసి బలగాల మోహరింపు, వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడతామని తెలిపారు. తప్పుడు సమాచారంపై నిఘా బలోపేతం చేసామని, అపోహలు, ఉద్రిక్త పరిస్థితులకు అస్సలు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, ఇది మున్సిపాలిటీ ప్రాంతాలకు వర్తించదని ప్రజలు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రచారానికి సంబంధించి పత్రికా ప్రకటనలు, కరపత్రాలు, ప్రచార సామగ్రి ముద్రణ ఖర్చులను అభ్యర్థులు తప్పనిసరిగా వెల్లడించాలని సూచించారు. ప్రింటింగ్ ప్రెస్‌లు, జిరాక్స్ సెంటర్లు ముద్రించిన పత్రికా, కరపత్రాలపై ప్రతులు సంఖ్య, ముద్రణ వివరాలు స్పష్టంగా ముద్రించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని అన్ని అభ్యర్థులు, రాజకీయ నాయకులకు సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠానికి, గ్రామస్థాయిలో పారదర్శకతకు జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని ఆయన అన్నారు. జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని కార్యాచరణలు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: