తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ప్రకాశం స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగుల క్రీడలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా జాతీయ క్రీడా ఉత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రతి ఒక్కరూ విధిగా క్రీడల్లో పాల్గొనాలని దానివల్ల మానసిక శారీరిక దృఢత్వం ఏర్పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ క్రీడలలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, త్రో బాల్, చెస్ మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్ టగ్ ఆఫ్ వార్, 100 మీటర్స్ వాక్, మరియు పరుగు పందెం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏం. విద్య చందన, జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంఘం వెంకట పుల్లయ్య, డిపిఆర్ఓ అజ్గర్ హుస్సేన్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషు, కొత్తగూడెం తాసిల్దార్ పుల్లయ్య, జిల్లా క్రీడా సంఘాల కార్యదర్శులు కె. మహిధర్ ఆర్. రాజేంద్రప్రసాద్, గమలాపురం సత్యనారాయణ, గోపి కృష్ణ, కాశీ హుస్సేన్, మట్టపర్తి రమేష్, బరిగెల భూపేష్, ఇమామ్ ,ప్రవీణ్ కుమార్, సతీష్ బాబు, పీడీలు ప్రేమ్ కుమార్, యుగంధర్ డివైఎస్ఓ ఆఫీస్ బేరర్స్ లక్ష్మణరావు, తిరుమలరావు, ప్రభుత్వఉద్యోగులు , సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ