తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 53వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో ప్రదర్శిస్తున్న ఈ ఎక్స్పర్మెంట్స్ అన్ని ప్రతి విద్యార్థి వరకు చేరిన నాడు ఈ ప్రదర్శన సఫలీకృతం ఐనట్టు , అందుకు ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు అన్నారు. మన జిల్లాలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేసుకున్నందుకు జిల్లా కలెక్టర్ కి , జిల్లా విద్యా శాఖాదికారికి, ఇతర బాధ్యులకు అభినందనలు . ఈ నెల 25, 26,మరియు 27 తేదీలలో జరుగుతున్న జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ లు విద్యార్థులలో వైజ్ఞానిక పరిజ్ఞానం, తాత్విక ఆలోచనలు మరియు సృజనాత్మక పెంపొందించుతా యని అన్నారు. నేటి ఈ సైన్స్ ఫెయిర్ లే రేపటి మానవ జీవనానికి అధునాతన సౌకర్యాలకు మార్గాలు అని పేర్కొన్నారు. నేడు ప్రపంచ ఉపయోగిస్తున్న టెక్నాలజీ విద్యార్థుల ప్రయోగాలద్వారా అభివృద్ధి సాధించినది అని తెలిపారు. సాంబశివ రావు సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించి విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంకా కొత్తగూడెం MEO మధురవాణి , ప్రభత్వ పరీక్షల విభాగం జిల్లా కార్యదర్శి మాధవరావు , జిల్లా విద్యా శాఖ కో ఆర్డినేటర్లు సతీష్ , సైదులు , నాగరాజశేఖర్ , జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి నీరజ. చుంచుపల్లి , జూలూర్పాడ్ , లక్ష్మీదేవిపల్లి, చండ్రుగొండ మండల విద్యా శాఖాధికార్యులు బాలాజీ , ఝుంకీలాల్ , కృష్ణయ్య , సత్యనారాయణ మరియు వివిధ పాఠశాలల హెడ్ మాస్టర్లు సంజీవ రావు , ద్రౌపది, వాణి , లక్ష్మి , వివిధ పాఠశాలల విద్యార్థులు మరియు మీడియా ఇంచార్జ్ రాములు, దస్తగిరి , జహంగీర్ షరీఫ్ , రాజయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోగాలు అద్భుతం డాక్టర్ తెల్లం వెంకట రావు , భద్రాచలం శాసన సభ్యులు. 53వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో ప్రదర్శిస్తున్న ప్రయోగాలను పరిశీలించిన డాక్టర్ తెల్లం వెంకట రావు MLA భద్రాచలం శాసన సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ మంచి ప్రయోగాలు చేసి ప్రదర్శించు తున్నారని అన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. నిర్వాహకులను అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ