తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు.బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ 53,47,315 కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యా రంగానికి 10 శాతం నిధులు అనగా సుమారు 5,34,000 కోట్లను కేటాయించాల్సి ఉండగా కేవలం 1,39,289 కోట్లు అనగా కేవలం 2.53 శాతం మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారని,వైద్య రంగానికి కేవలం 2.1శాతం నిధులను మాత్రమే కేటాయించిందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.బీజేపి అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఎక్కడా ప్రస్తావించలేదని రాష్ట్రంలో బీజేపీ కి 8 మంది ఎంపీలు ఉన్నా నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.పునర్విభజన చట్టంలో పొందు పరిచిన హామీల ప్రస్తావన లేదు.తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్ అని ఆరోపించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ