తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ ( ) భద్రాద్రి జిల్లా పాల్వంచ అయ్యప్ప స్వామి గుడిలో ఇరుముడి కార్యక్రమాన్ని శనివారం నాడు నిర్వహించారు. టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అయ్యప్ప స్వాములతో కలిసి పూజలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జోషి, భావ్ సింగ్, బొబ్బల వెంకట్ యాదవ్, సైదులు, చందు, చాణక్య, మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ