తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 14 తెలుగు వెలుగు : జూలూరుపాడు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన ఈసం గోవర్ధన్ తండ్రి పేరు రాము 18 సంవత్సరాలు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు అయితే గత కొంతకాలంగా తన తండ్రి ఈసం రాము మద్యానికి బానిసయ్యి తన ఆలన పాలన బాగోగులు చదువు గురించి పట్టించుకోవడంలేదని కోపంతో గత కొంత కాలం క్రితం తన అమ్మమ్మగారిల్లు అయిన పడమట నర్సాపురం గ్రామానికి వెళ్లి వారి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన ఆలనా పాలన బాగోగుల గురించి ఎవరు పట్టించుకోవడంలేదని తీవ్ర మనోవేదనకు గురై జీవితంపై విరక్తి కలిగి నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ హుక్కుకు చీరతో ఉరి వేసుకుని మరణించినాడని మృతుడి తల్లి ఈసం వెంకటలక్ష్మి ఫిర్యాదు ఇవ్వగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ జూలూరుపాడు పోలీస్ స్టేషన్ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ