తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి మండల టిఎల్ఎం కార్యక్రమం జిహెచ్ఎస్ బాబు క్యాంప్ పాఠశాల నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండల విద్యాశాఖ అధికారి బి బాలాజీ మరియు కాంప్లెక్స్ హెచ్ఎం నీరజ హాజరయ్యారు. మండల ఉపాధ్యాయులు తయారుచేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ పరిశీలించారు నాలుగు సబ్జెక్టుల నిర్వహించిన టి.ఎల్.ఎమ్ పోటీలలో ఎంపియుపిఎస్ పెనుబల్లి పాఠశాల కు తెలుగు, ఇంగ్లీష్ బోధిస్తున్న ఎం విజయ ఎం రాజయ్య లకు మొదటి బహుమతి లభించింది. ఎంపీపీఎస్ రామ్ నగర్ ఉపాధ్యాయురాలు వెంకట రమణకు గణితంలో అలాగే ఎంపీపీ ఎస్ వెంకటేశ్వ కాలనీ ఉపాధ్యాయురాలు మీనా కుమారికి సామాన్య శాస్త్రంలో మొదటి బహుమతి లభించింది. ఈ నలుగురు ఉపాధ్యాయులను మండల విద్యాశాఖాధికారి బాలాజీ అభినందనలు తెలుపుతూ జిల్లా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ పోటీలకు పంపనున్నట్లుగా తెలిపినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ