Sunday, 19 April 2026 03:14:31 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ధర్తీ అభా జన్ భాగీదారి ప్రచారంలో భాగంగా భారీ సికిల్ సెల్ స్క్రీనింగ్ క్యాంపుల నిర్వహణ

Date : 12 July 2025 12:48 PM Views : 648

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ధర్తీ అభా జన్ భాగీదారి ప్రచారంలో భాగంగా భారీ సికిల్ సెల్ స్క్రీనింగ్... 15055 గిరిజన విద్యార్థులకు పరీక్షలు – 429 క్యారియర్‌లు, 47 రోగులు గుర్తింపు.. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ నేతృత్వంలో విజయవంతంగా క్యాంపుల నిర్వహణ.. జిల్లాలో ధర్తీ అభా జన్ భాగీదారి ప్రచారంలో భాగంగా, గడచిన వారం రోజులుగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సికిల్ సెల్ స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించబడింది అని జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో 15,055 మంది ఆశ్రమ, గిరిజన సంక్షేమ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సంతృప్తికరంగా ఫలితాలను అందించాయన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కలెక్టర్ జితేష్ వి. పాటిల్, పిఒ ఐటిడిఎ, ఎన్‌సిడి ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ మధువరన్ మార్గదర్శకత్వంలో నిర్వహించబడింది అని తెలిపారు . అన్ని పిహెచ్‌సీలు, యుపిహెచ్‌సీల ఎంఓలు, క్షేత్రస్థాయి వైద్య బృందాలు ఈ సర్వేలో భాగస్వాములై అహర్నిశలు శ్రమించారు అన్నారు. ఈ పరీక్షల ద్వారా 429 మంది క్యారియర్లు, 47 మంది సికిల్ సెల్ రోగులను గుర్తించగా, వారికి తగిన కౌన్సెలింగ్ మరియు వైద్యసహాయం అందించనున్నారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా సికిల్ సెల్ ఐడి రిజిస్టర్ నిర్వహించేందుకు హెడ్‌మాస్టర్లకు సూచనలు చేశారు. ఆరోగ్య శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖల మధ్య సమన్వయం వల్ల ఈ కార్యక్రమం విజయవంతమైందని ఆమె తెలిపారు . రాబోయే వారం నుండి ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులను కూడా ఇదే నమూనాలో పరీక్షించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే సికిల్ సెల్ వ్యాధి నిర్మూలనలో ఇలాంటి క్యాంపుల నిర్వహణ ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :