తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి మెయిన్ వర్క్‌షాప్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న అన్నబోయిన రాజేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని,మెడికల్ అన్‌ఫిట్ చేయిస్తానని,బదిలీలు చేయిస్తానని చెప్పి సుమారు రూ.50లక్షలు రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.ఈ క్రమంలో రాజేశ్వరరావుతో పాటు మరికొందరు కలిసి ఒక బృందంగా ఏర్పడి, పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ నేతృత్వంలో అధికారులు రాజేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా కొన్ని ప్రముఖ పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముంది. సింగరేణిలో కొనసాగుతున్న ఈ అవినీతి వ్యవహారం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతోంది.
Admin
తెలుగు వెలుగు టీవీ