తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా నిర్వహిస్తోంది. భద్రాద్రి జిల్లా కేంద్రంలో జరిగే ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్య క్రమానికి అధికారులు, ప్రజలు హాజరుకావాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ