తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 18 తెలుగు వెలుగు)ఈరోజు స్థానిక జూలూరుపాడు ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఇచ్చినటువంటి వీడ్కోలు సభలో ముఖ్యఅతిథిగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ బాదావత్ రవి హాజరైనారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ మీ భవిష్యత్తు లక్ష్యాలను సరిగా ఎంచుకొని నిబద్దతతో మీ గమ్యాలను చేరుకోవాలని సూచిస్తూ తల్లి, తండ్రి, తర్వాత గురువు చాలా ముఖ్యమని, గురువుకు మించిన దైవం లేదని తెలిపారు. ఈ కార్యక్రమం అంతా స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ తప్పేట లక్ష్మీ నరసయ్య అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ఈనెల 21 నుండి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను చక్కగా చదువుకొని మంచిగా రాయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలోని మొత్తం పిల్లలు పాల్గొని కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోని మరియు ఆటపాటల మధ్య విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఏపిసి చైర్మన్ శ్రీమతి మంద స్రవంతి హాజరయ్యారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు శాంత కుమారి,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,జివిఆర్ ప్రసాద్,కృష్ణ,గురుమూర్తి,ఎస్వీ పటేల్, శకుంతల,ఉమా,లలిత,సునీత,నాగ రమేష్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు పరీక్షకు సంబంధించిన మెలుకులను జాగ్రత్తలను సూచించడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ