తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫామ్ 1,2,3,4 అప్డేషన్ త్వరితగతిన చేపట్టాలి హైదరాబాద్ నుండి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్ మరియు రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్కెట్ వాల్యూ అప్డేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ వాల్యూ అప్డేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా భూభారతి ఐజీఆర్ఎస్ పోర్టల్‌లో ఫామ్ 1, 2, 3, 4లకు సంబంధించిన అప్డేషన్ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. జీవో నెంబర్ 44 ప్రకారం జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి మార్కెట్ వాల్యూ సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెంపుతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న 379 రెవెన్యూ గ్రామాలలో మార్కెట్ వాల్యూ అప్డేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భూభారతి, ఐజీఆర్ఎస్ అప్డేషన్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఈ డిస్టిక్ మేనేజర్ సైడేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ