తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చర్ల : చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చెన్నాపురం గ్రామ శివారులో స్థానికుల సమాచారం మేరకు ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది.బంటి రాధా@నీల్సు అను 25 సంవత్సరాల మహిళను మావోయిస్టులు అతికిరాతకంగా చంపి అక్కడ పడివేశారు.మృతురాలి గురించి వివరాలు సేకరించగా హైదరాబాద్ వాస్తవ్యురాలైన రాధ ఇంటర్మీడియట్(DMLT) చదివి 2018లో మావోయిస్టు పార్టీలో చేరింది.ఈమె AOB లో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీలో ఏరియా కమిటీ మెంబర్ గా పని చేస్తున్నదని తేలింది.మావోయిస్టు పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక పార్టీని వేడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న బంటి రాధా@నీల్సు ను పోలీసులకు సమాచారం అందిస్తున్నదనే నెపంతో అతి కిరాతకంగా చంపడం హేయమైన చర్య.సమన్యాయం,సామాజిక న్యాయం అంటూ మాటలు చెప్పే మావోయిస్టు పార్టీ నాయకులు లొంగిపోవాలనుకునే ఇతర సభ్యులను ఎందుకు వదిలేస్తున్నారు.దళితురాలైన రాధను ఎందుకు చంపారో సమాజానికి సమాధానం చెప్పాలి.ఇట్టి విషయంలో చర్ల పోలీస్ స్టేషన్లో Cr.No.81/2024 క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ