తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి పరిధిలోని బీసీ , ఓబీసీ కార్పొరేట్ మీటింగ్ ను అధ్యక్షులు నాగేశ్వరరావు , ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు . బిసి ,ఓబీసీ అసోసియేషన్ చీఫ్ లైజనింగ్ ఆఫీసర్ ను నియమించడం పట్ల వారు ముందుగా సింగరేణి సిఎండి బలరాం నాయక్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ,ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఒక ఏరియా లైజనింగ్ ఆఫీసర్ ను నియమించాలని, ఆఫీసు నిర్వహించుటకు ఒక సింగరేణి క్వార్టర్ ను కేటాయించాలని, జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని , ప్రతి ఏరియాలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను నిర్వహించటానికి ఆర్థిక వనరులను సమకూర్చలిసిందిగా వారు కోరారు. అనంతరం కుసాన వీరభద్రం ను పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు . సెంట్రల్ వర్క్ షాప్ మెయిన్ హాస్పిటల్ , ఎస్ అండ్ పిసి లకు నూతన కమిటీలను వేశారు .ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఏరియా మేనేజర్ ఎం. మల్లేష్ కూసన వీరభద్రం, వి. వెంకటేశ్వర్లు, పీతాంబరం,శ్రీనివాస్,ప్రకాష్,వెంకటేశ్వర్లు,సురేష్,వెంకట రమణ,వీరయ్య తదితరులు పాల్గొన్నారు .
Admin
తెలుగు వెలుగు టీవీ