Friday, 19 June 2026 10:16:38 PM
# బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 19 June 2026 08:13 PM Views : 7

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్,ఈనెల 21న ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం నాలుగు పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మొదటగా సింగరేణి కాలరీస్ ఉమెన్స్ డిగ్రీ మరియు పీ.జీ కళాశాల యందు 360 మంది విద్యార్థులు ,TGSWR స్కూల్ &జూనియర్ కళాశాల (బాలికలు) పాల్వంచ సెంటర్లో 288 మంది విద్యార్థులు, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అటానమస్ పాల్వంచనందు 240 మంది విద్యార్థులు,Sr Govt Arts &Science కళాశాల కొత్తగూడెం నందు 240 మంది విద్యార్థులు ఇలా మొత్తం 1,128 మంది విద్యార్థులు ఈ జిల్లా నందు పరీక్షకు హాజరుకానున్నారు.ఈ మేరకు NEET-2026 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కొన్ని సూచనలను చేశారు.విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం రెండు గంటలు ముందుగానే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని మరియు ఒక్క నిమిషం ఆలస్యమైనా గేట్స్ మూసేస్తారని, అలాగే అభ్యర్థులు మీకు హాల్ టికెట్లో సూచించిన పరీక్షా కేంద్రం ఉన్న ప్రాంతాన్ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా పరీక్ష రోజు ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ , చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు , రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని , మరియు వదులుగా ఉండే దుస్తులను ధరించాలని సూచించారు . మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు , ఆర్నమెంట్స్, మరియు ఇతర నిషేధిత వస్తువులు పరీక్షా కేంద్రానికి తీసుకు రాకూడదని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని తల్లిదండ్రులు కూడా విద్యార్థులను సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నీట్ 2026 పరీక్ష అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి ప్రవేశపరీక్ష కావున విద్యార్థులు తల్లితండ్రులు మరియు పరీక్షా సిబ్బంది అందరూ ఎన్ టి ఏ నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని , నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే సంబంధిత చర్యలు తీసుకొనబడతాయని హెచ్చరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: