Sunday, 19 April 2026 03:02:09 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కష్టజీవుల వెన్నంటి ఉండేది కమ్యూనిస్టులే : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Date : 18 August 2024 08:16 PM Views : 468

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : కష్టజీవుల వెన్నంటి ఉండేది కమ్యూనిస్టులేనేని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఎస్సార్ గార్డెన్స్ లో సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని తొలుత అరుణ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు, కార్మికుల అండగా ఉంటూ సమస్యల పై ప్రశ్నిస్తూ పోరాడాది కమ్యూనిస్టులు మాత్రమే అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర కమ్యునిస్టు పార్టీకి ఉందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో నిరుపేదలకు భూముల పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకే ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ వందేళ్లు అధికారం లేకున్నా నిలబడగలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక సీపీఐ అని, దాన్ని మరింత బలోపేతం చేస్తూ జనబలంతో కమ్యూనిస్టు పార్టీని అగ్రభాగాన నిలబెదాంనీ, కమ్యూనిస్టులు చట్ట సభల్లో ఉంటే వారి తరుపున పోరాడుతారు ప్రజలు గుర్తించారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని ప్రతి మండలంలో ప్రాతినిధ్యం ఉండే విధంగా కార్యకర్తలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని నిత్యం ఏదో ఒక మూలన మహిళలపై దాడులు, హత్యలు హత్యాచారాలు జరుగుతున్నవిని వీటిని అరికతటానికి కఠిన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు రాజకీయ రిపోర్ట్, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా జిల్లా రాజకీయ రిపోర్ట్ ప్రవేశపెట్టారు. జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య, కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, పుల్లారెడ్డి, కె. సారయ్య, ఏపూరి బ్రహ్మం, మున్నా లక్ష్మీ కుమారి, ఎస్ డి సలీం, నరాటి ప్రసాద్, కల్లూరి వెంకటేశ్వర్లు, రావులపల్లి రవికుమార్, కమటం వెంకటేశ్వరరావు, చండ్ర నరేంద్రకుమార్, రేసు ఎల్లయ్య, జిల్లా సమితి సభ్యులు బరిగెల సంపూర్ణ, వాసిరెడ్డి మురళి, కరిష రత్నకుమారి, మామిడాల ధనలక్ష్మి, ఎస్.కె నాగుల్ మీరా, భూక్య శ్రీనివాస్, ఎస్.కె ఫయూం, భాస్కర్, మహబూబీ మండల, పట్టణ కార్యదర్శులు ప్రజాసంఘాల జిల్లా బాధ్యులు తదితులున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :