తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం తెలుగు వెలుగు సెప్టెంబర్ 8 : జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల వ్యాప్తంగా సుపరిచితులు రోకటి సురేష్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందగా. పాపకొల్లు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి . విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆయన నివాసానికి వెళ్లి సురేష్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను తన పై కప్పి జోహార్ సురేష్ జోహార్లు అంటూ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్, కాంగ్రెస్ జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి, మరియు మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ బి ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షుడు రామ్మూర్తి, సిపిఐ మండల అధ్యక్షుడు గుండె పిన్ని వెంకటేశ్వర్లు, మరియు వివిధ పార్టీల నాయకులు, పాల్గొని నివాళులర్పించారు
Admin
తెలుగు వెలుగు టీవీ