తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం గోదావరి నీటిమట్టం పెరిగింది. వేసవిలో కేవలం 2 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉండగా మంగళవారం ఉదయం 9 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. రామాలయ దర్శనానికి వచ్చే భక్తులు గోదావరి వద్ద స్నానాలకు వెళ్ళకుండా ఉండాలని సూచించారు
Admin
తెలుగు వెలుగు టీవీ