Sunday, 19 April 2026 02:16:34 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం – పకడ్బందీగా నిర్వహణ : జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు.

Date : 02 February 2026 08:23 PM Views : 89

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ పరీక్షా కేంద్రాలలో ప్రాక్టికల్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.ఈరోజు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలలో ఉదయం సెషన్‌లో జనరల్ కోర్స్‌లో 974 మంది విద్యార్థులకు గాను 948 మంది హాజరుకాగా 26 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ కోర్స్‌లో 1,381 మందికి గాను 1,324 మంది పరీక్షలకు హాజరుకాగా 57 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 2,365 మందికి గాను 2,182 మంది హాజరై 83 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్‌లో జనరల్ కోర్స్‌లో 703 మందికి గాను 685 మంది హాజరై 17 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ కోర్స్‌లో 1,362 మందికి గాను 1,296 మంది హాజరై 66 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 2,065 మందికి గాను 1,982 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 83 మంది గైహాజరయ్యారని తెలిపారు.ప్రాక్టికల్ పరీక్షల ప్రారంభ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు జిల్లాలోని మణుగూరు, ఎడులబయ్యారం, భద్రాచలం ప్రాంతాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్న కళాశాలలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ల్యాబ్ సదుపాయాలు, హాజరు నమోదు విధానం, ప్రశ్నపత్రాల గోప్యత, తదితర అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ విద్యామండలి మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలకు, పరీక్షా సిబ్బందికి సూచనలు చేశారు. మిగిలిన రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ఇదే విధంగా శాంతియుతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :