తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం మానుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు అన్నారు. సోమవారం జేబీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్రం చేపట్టిన యుజీసీ కొత్త నిభందనలు "బిల్లు చెల్లించాలి కానీ, భోజనం ఆర్డర్ చేయకూడదు" అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఒకవైపు యూనివర్సిటీలకు రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని చెబుతూ..మరోవైపు ఉపకులపతుల నియామకం నుంచి,ప్రవేశాల వరకు కీలకమైన నిర్ణయాల్లో రాష్ట్రాల పాత్రను తొలగిస్తున్నారని.కేంద్ర ప్రభుత్వ విధానం కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహించేలా ఉందని విమర్శించారు. డిగ్రీ కోర్సులకు ప్రవేశ పరీక్ష తప్పనిసరి చేయడంతో వెనుకబడిన వర్గాల విద్యార్దులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు వ్యవస్థల్ని నిర్మించుకుంటాయని వాటిని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపాలన్న పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. ఈకార్యక్రమంలో వినయ్, పూనెమ్ మురళి, బాబీ, బన్ను, శివ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ