Sunday, 19 April 2026 03:24:09 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు – ఒంటిగంట వరకు 80.64 శాతం పోలింగ్ నమోదు

Date : 17 December 2025 02:20 PM Views : 142

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా నిర్వహిస్తున్న పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.00 గంటల వరకు సజావుగా కొనసాగినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అల్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, టేకులపల్లి, యెల్లందు మండలాల్లో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడిందన్నారు. మండలాల వారీగా ఒంటిగంట వరకు నమోదైన పోలింగ్ శాతం ఈ విధంగా ఉందన్నారు. అల్లపల్లి 66.88 శాతం, గుండాల 85.93 శాతం, జూలూరుపాడు 77.01 శాతం, లక్ష్మీదేవిపల్లి 82.28 శాతం, సుజాతనగర్ 85.75 శాతం, టేకులపల్లి 84.16 శాతం, యెల్లందు 77.93 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు.మొత్తం పోలింగ్ శాతం 80.64 నమోదు అయింది అని తెలిపారు. మధ్యాహ్నం 1.00 గంటల వరకు పోలింగ్ కేంద్రాల లోపల లేదా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉన్న ప్రతి ఓటరికి తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చివరి ఓటరు వరకు పోలింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను సీలింగ్ చేసి, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, పోలీస్ బందోబస్తు కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :