తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : ఉట్లపాలి పరిధిలో ఉన్న గంగారాం చెరువులో శనివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.చెరువు నీటిపై మృతదేహం తేలియాడుతుండటాన్ని పశువుల కాపరులు మరియు రైతులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి శుక్రవారం నాడు చేపల వేట కోసం తెప్పపై చెరువులోకి వెళ్లి నీటిలో మునిగిపోయి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి దుర్వాసన వస్తుండటంతో, పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసే చర్యలు చేపట్టారు.
Admin
తెలుగు వెలుగు టీవీ