తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచలోని ఖేలో ఇండియా ఆర్చరీ సెంటర్కు చెందిన మేకల విక్రాంత్ (అండర్-10 విభాగం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో 26th to 31st మార్చి 2026 వరకు నిర్వహించిన "NTPC చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ కిడ్స్" నేషనల్ ఆర్చరీ ఛాంపియన్ షిప్"లో ఇండియన్ రౌండ్ విభాగంలో పోటీ పడి, తన అద్భుత ప్రతిభతో మూడవ స్థానం దక్కించుకుని కాంస్య పతకాన్ని అందుకున్నాడు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, IAS విక్రాంత్ను మరియు కోచ్ తానం కళ్యాణ్ ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో పతకం సాధించడం గొప్ప విషయమని భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని పేర్కొన్నారు.విక్రాంత్ విజయంలో అతని కోచ్, తల్లిదండ్రులు, మరియు ఖేలో ఇండియా ఆర్చరీ సెంటర్ సిబ్బంది ఈ విజయానికి కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో DYSO పరంధామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ