తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రేవంత్ రెడ్డి ఏడవ హామీ ఏమైంది ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తున్న ప్రభుత్వం : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒక సామాన్య నిరసన నుంచి భావోద్వేగ స్థాయికి చేరి,ప్రాణనష్టం దాకా వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందని,ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా పరిగణించాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.తమ డిమాండ్లను పరిష్కరించాలని దాదాపు 41 రోజుల క్రితం కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడ వల్లే శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ఒడిగట్టాడని,రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు కాకుండా ఏడవ హామీ ప్రజాస్వామ్యం అని ఎవరైనా నిరాసన తెలిపే స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రకటించి అందుకు విరుద్ధంగా నేడు సమ్మెను అణచివేసే కుట్రలు చేస్తున్నాడని విమర్శించాడు.ఆర్టీసీ కార్మికులు చేపట్టే ప్రతీ నిరసన కార్యక్రమం వెనక జై భీమ్ రావ్ భారత్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటారని స్పష్టం చేశారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకునేందుకు చట్టబద్ధమైన పోరాట పందాలు కొనసాగిద్దామని ఎవరూ క్షణికావేశానికి గురై ఆత్మహత్యయత్నాలకు పాల్పడ వద్దని విజ్ఞప్తి చేశారు.మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఐదు కోట్ల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆకుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇంకా మొండి ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించకుండా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,జిల్లా కార్యదర్శి చెనిగరపు నిరంజన్ కుమార్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,శంకర్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ