తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం హైద్రాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు,పౌర సరఫరాల, సహకార,సంబంధిత అధికారులతో ధాన్యం,కాటన్, సోయా, కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు,జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంనుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు,ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, పత్తి, సోయా, తదితర పంటల కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని, వెంటనే కేంద్రాలను ప్రారంభించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని, వాతావరణ పరిస్థితులను రైతులకు తెలియజేస్తూ అప్రమత్తంగా ఉంచాలని, కేంద్రాలలో ప్యాడీ క్లీనర్స్, మాచర్ మిషన్, మిషనరీస్, గన్ని సంచులు, తార్పాలిన్లు, లారీలను సిద్ధంగా ఉంచుకోవాలని, సూచించారు,వచ్చే మూడు నాలుగు వారాలలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు, మిల్లర్లు, కాంట్రాక్టర్స్, హమాలీలు, అంశాలపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు, పూర్తిస్థాయిలో అన్ని విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేసే ధాన్యం సేకరణ కొనుగోళ్ల విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు,వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు,ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డిఓ విద్యా చందన, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సహకార శాఖ అధికారి శ్రీనివాసరావు, డిఎం సివిల్ సప్లై త్రినాధ్ బాబు , మార్కెటింగ్ అధికారి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ