Friday, 19 June 2026 05:39:42 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి

Date : 02 September 2025 08:05 PM Views : 733

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 360 జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్-II) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోళ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి భూక్యా కృష్ణమూర్తి, మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వాంకుడోత్ శివ సింగరేణి సీఎండీకి వినతిపత్రం సమర్పించారు. సంఘం తెలిపిన వివరాల ప్రకారం, సింగరేణి (SCCL) మార్చి 23, 2024న సర్క్యులర్ నం: CRP/PER/R/2024/1371 ద్వారా 360 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, జనవరి 10, 2025న సర్క్యులర్ నం: CRP/PER/R/2025/32 ద్వారా ఈ నోటిఫికేషన్ రద్దు చేసి, తిరిగి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదే నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర పోస్టులు ఇప్పటికే భర్తీ చేయబడ్డాయి. కానీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ మాత్రం నిలిచిపోయింది. ఈ పోస్టుల భర్తీ త్వరగా చేపట్టడం వల్ల కొత్తగా చేరిన అర్హులైన గిరిజన ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని సంఘం నాయకులు తెలిపారు. గిరిజన అభ్యర్థులు ఓపెన్ కాంపిటీషన్ తో పాటు 10 శాతం రిజర్వేషన్ కోటా ద్వారా కూడా పెద్ద సంఖ్యలో ఈ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఈ నియామక ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు కోరారు. సీఎండీని కలిసిన వారిలో మందమర్రికి చెందిన శ్రీ సుమన్ (అండర్ మేనేజర్) మరియు భూపాలపల్లికి చెందిన ధరావత్ రమేష్ ఉన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :