Wednesday, 15 April 2026 05:21:26 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

జూనియర్ ఇంటర్ ఫలితాల్లో కొత్తగూడెం ‘శ్రీనలంద’ స్టేట్ ఫస్ట్

Date : 12 April 2026 03:31 PM Views : 139

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూనియర్ ఎంపీసీలో పరిమి చరణ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇతర గ్రూపులలోనూ రాష్ట్రస్థాయి ర్యాంకుల పరంపర ఫలితాల వెల్లడితో శ్రీనలంద ప్రభంజనం 34 ఏళ్ల విద్యా ప్రస్థానంలో యాజమాన్య అంకితభావానికి అద్దం పడుతున్న ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా నేడు వెలువడిన జూనియర్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీనలంద జూనియర్ కాలేజీ రాష్ట్రస్థాయి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించింది. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 469 మార్కులు సాధించిన పరిమి చరణ్ “స్టేట్ ఫస్ట్” ర్యాంకును సాధించి తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచారు. అలాగే జూనియర్ ఎంపీసీలోనే మరో విద్యార్థి కె. ఉజ్వల్ అభియవ్ సాయి 470కి 468 మార్కులు సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. జూనియర్ బైపీసీలో ఎస్. శ్రీలక్ష్మీ మౌనిక 440కి 436 మార్కులు సాధించి విద్యార్థినుల్లో ప్రతిభ చాటారు. జూనియర్ ఎంఈసీ గ్రూపులో జి. ఊర్మిళ శ్రీ 500 మార్కులకు గాను 493 మార్కులు నమోదు చేసి తన సత్తా చాటారు. జూనియర్ సీఈసీ గ్రూపులో సిలిగం కౌశిక్ 500కి 489 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకును నమోదు చేయగా, అదే గ్రూపులో ఎండి సన రజాక్ 488 మార్కులతో విశేష ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ—అన్ని గ్రూపులలో ఒకే సంస్థకు చెందిన విద్యార్థులు అగ్రశ్రేణి ఫలితాలు సాధించడం అపూర్వ ఘట్టమని విద్యా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విద్యా ప్రమాణాల్లో రాజీలేని ప్రస్థానం నల్లబంగారపు సిరులకు పేరుగాంచిన కొత్తగూడెంను, తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ విద్యా ప్రమాణాలతో నిలిచే విద్యాకేంద్రంగా తీర్చిదిద్దడంలో శ్రీనలంద జూనియర్ కాలేజీ విశిష్ట పాత్ర పోషిస్తోంది. ప్రతి సంవత్సరం జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ఈ విద్యాసంస్థ విద్యార్థులు సాధిస్తున్న అగ్రస్థాయి ఫలితాలే ఇందుకు నిదర్శనం. దాదాపు 34 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ విద్యా ప్రస్థానంలో యాజమాన్యం అంకితభావం, విద్యా ప్రమాణాల పరిరక్షణలో చూపుతున్న చిత్తశుద్ధి సంస్థకు రాష్ట్రస్థాయి ఖ్యాతి తెచ్చిపెట్టాయి. లక్ష్యం ఏదైనా — విజయం శ్రీనలందదే విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన ఇంటర్మీడియట్ దశను బలమైన పునాదులతో అందించడంలో శ్రీనలంద జూనియర్ కాలేజీ ఆరంభం నుంచే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ఏ గ్రూపులో చదువుతున్న విద్యార్థి అయినా అతని/ఆమె భవిష్యత్తుపై ప్రత్యేక బాధ్యత తీసుకుంటూ, రాష్ట్రంలోనే అత్యుత్తమ అధ్యాపకులు, పకడ్బందీ బోధనా పద్ధతులు, నిరంతర పర్యవేక్షణ, ఒత్తిడి లేని అభ్యాస వాతావరణం ద్వారా సబ్జెక్టులపై పట్టు సాధించేలా చేయడమే శ్రీనలంద విజయరహస్యమని సంస్థ చైర్మన్ శ్రీ ఎంవీ చౌదరి, సీఈఓ శ్రీ మేదరమెట్ల చైతన్య కృష్ణ తెలిపారు. జూనియర్ ఎంపీసీలో పరిమి చరణ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం, అలాగే ఇతర గ్రూపులలోనూ రాష్ట్రస్థాయి ర్యాంకులు రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. ర్యాంకులే తమ విద్యాసంస్థకు ఏకైక కొలమానం కాదని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడాన్ని పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఫలితాలు తమపై మరింత బాధ్యతను మోపాయని, రాబోయే రోజుల్లోనూ శ్రీనలంద జూనియర్ కాలేజీ విజయపరంపర కొనసాగుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :