Monday, 20 April 2026 05:30:24 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

గుండాల పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు పాల్గొన్న ఇల్లందు డిఎస్పి చంద్రభాను

Date : 12 May 2025 08:46 PM Views : 486

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా గుండాలలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఈ రోజుతో ముగిసింది.ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు డిఎస్పి ఎన్.చంద్రబాను హాజరయ్యారు.ఈ వాలీబాల్ టోర్నమెంట్లో గుండాల,ఆళ్లపల్లి,కొమరారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 40 జట్లు పాల్గొన్నాయి.ఈ 40 జట్లలో ఫైనల్ కు దామరతోగు మరియు చిన్న వెంకటాపురం జట్లు చేరుకున్నాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ నందు రెండు జట్లు హోరాహోరీగా పోరాడినాయి.రెండు జట్లలో దామతోగు జట్టు విజేతగా నిలిచింది.మొదటి స్థానంలో నిలిచిన దామరతోగుకు జట్టుకు బహుమతిగా 15000/- రూపాయలు మరియు షీల్డ్ అందజేయడం జరిగింది.చిన్న వెంకటాపురం జట్టుకు ద్వితీయ బహుమతిగా 10,000/-ల రూపాయలు మరియు షీల్డ్ అందజేయడం జరిగింది.మామకన్ను జట్టుకు తృతీయ బహుమతిగా 6000/-ల రూపాయలు మరియు షీల్డ్ ను అందజేయడం జరిగినది.ఈ సందర్బంగా ఇల్లందు డిఎస్పి చంద్రబాను గారు మాట్లాడుతూ ఏజెన్సీ యువత చెడు మార్గాల జోలికి పోకుండా చదువు,క్రీడలపై దృష్టి పెట్టాలి అని తెలిపారు.అసాంఘిక శక్తులకు సహకరించవద్దని కోరారు.ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పోలీసు వారు తమ వంతు భాద్యతగా క్రీడా పోటీలు,మెడికల్ క్యాంపులు,రోడ్డులు,కమ్యూనిటీ హాళ్లు,క్రీడాస్థలాల ఏర్పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించిన గుండాల సీఐ రవీందర్,యస్ఐ రవూఫ్ మరియు గుండాల సిబ్బందిని అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :