తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జులై 30 తెలుగు వెలుగు ) జూలూరుపాడు మండల కేంద్రంలోని జూలూరుపాడు గ్రామపంచాయతీ అంబేద్కర్ కాలనీ లో గల అంగన్వాడి స్కూలుకు వెళ్లే ప్రధాన రహదారి కొంచెం వర్షం పడితే అద్వానం. రోజు అంగనవాడి స్కూలుకి వెళ్లే చిన్నపిల్లలు మరియు హెల్త్ చెకప్ లు కోసం వచ్చే గర్భిణీ స్త్రీలు సైతం ఈ రహదారి గుండానే అంగన్వాడీకి వెళ్లాలి మొకాటి బురదల్లో నడవాలంటే ఎక్కడ జారిపడతామోనని భయమేస్తుందని, ఏదైనా ప్రమాదం జరిగితే మా పరిస్థితి ఏమిటని స్థానిక ప్రజలు పంచాయతీ సిబ్బంది పట్టించుకుని వెంటనే ఈ రహదారికి సీసీ రోడ్డు పోయించగలరని వేడుకుంటున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ